ఆన్లైన్ క్లాస్ లేక మీటింగ్ చేసే వారికి కొన్ని సలహాలు
కరోనా వైరస్ వల్ల వచ్చిన లాక్డౌన్ కారణంగా, క్లాస్‌రూం మరియు ఆఫీస్ వ్యవహారాలు ఇప్పుడు ఆన్లైన్ కెక్కాయి. వర్క్ ఫ్రం హోం, లెర్న్ ఫ్రం హోం ఇప్పుడు లేటేస్ట్ ట్రెండ్స్.
అయితే దీనివల్ల సీరియస్ మరియు క్రమశిక్షణ ఉన్న క్లాస్ లేక ఆఫీస్ వాతావరణం పోయి సౌలభ్యమైన, సుఖవంతమైన పరిసరాలు పిల్లలకు, ఉద్యోగస్తులకు లభిస్తున్నాయి. వీడియో చాటింగ్ కూడా ఎప్పుడూ చేయని కొంతమందికి తమ మొహాన్ని వీడియో లో చూస్తూ మాట్లాడడం కొత్తగా ఉంటోంది. అలాంటి వారి కోసమే ఈ పోస్ట్ లో క్రొన్ని సూచనలు, సలహాలు వ్రాస్తున్నాను.
లైటింగ్ సమస్య
చాలా మంది వీడియో జాయిన్ అవుతారు కానీ, వాళ్ళ మొహాలు ఎవరికీ కనిపించవు. వాళ్ళు వీడియో ఆన్ చేయలేదనో లేక నల్లగా ఉన్నారనో కాదు, వాళ్ళు లైటింగ్ కి ముందు నిలబడటం. అంటే వాళ్ళ ముందు కెమేరా, వెనుక లైటింగ్ ఉండడం. కాబట్టి లైటింగ్ మీ కెమేరా వెనుక ఉండేలా జాగ్రత్త పడండి.
కెమెరా యాంగిల్
కెమేరాను మీ ముఖానికి తగినంత దూరంగా, మీ కంటి చూపుకి సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోండి. లేకపోతే, మీ మొహం బాగా కనిపించదు.
సెల్ఫీ అలవాటు మానుకోండి
వీడియో మీటింగ్ లోకి వచ్చాక, మీరు చూడాల్సింది మీ స్వంత థంబ్‌నైల్ కాదు. అలా చూడడం వల్ల, మిమ్మల్ని చూసేవారికి మీరు ఎటో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది జాగ్రత్త. ఫోన్ అయినా, లాప్‌టాప్ అయినా వీడియో చాటింగ్ చేసేటపుడు మీరు చూడాల్సింది కెమేరాను.
పరధ్యానం వద్దు
వీడియో మీటింగ్ లో ఎంటర్ అయి, ఒకసారి అందరికీ హాయ్ చెప్పేసి, ఇక వీడియో ఆఫ్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొనేవారు కొందరు. మరి కొందరు వీడియో ఆన్ చేసి ఉంచి కూడా, పడుకొని సినిమా చూస్తున్నట్టు, కాఫీ లేదా వేరే ఏదైనా డ్రింక్ జుర్రుమని సౌండ్ చేస్తూ త్రాగుతూ, ఫోన్ లో వేరే ఎవరితోనో ఛాట్ చేస్తూ, ఇలాంటి రక రకాల బిహేవియర్ వల్ల మిగతా పార్టిసిపెంట్స్ కి ఉన్న ఇంటరెస్ట్ కూడా పోతుంది. దయచేసి, మీరు ఏ పని మీద మీటింగ్ లోకి వచ్చారో ఆ మూడ్ లో సిన్సియర్ గా ఉండండి. రియల్ క్లాస్ లో లేక మీటింగ్ లో ఎంత సిన్సియర్ గా ఉంటారో అంత!
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ఆన్‌లైన్ మీటింగ్ లేక క్లాస్ చాల ఇంపార్టెంట్. కాబట్టి వీలైతే మీ ఇంట్లో వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పండి. లేదా మీరే ప్రశాంతంగా ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపొండి. అంతే కాని మీ ఇంట్లో సౌండ్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగ వినిపించనీయకండి.
మ్యూట్ ఆర్ అన్‌మ్యూట్
ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు, వినేవాడు అతడినే చూస్తూ, అతని మాటలకు తగినట్టు తలాడిస్తూ, ‘ఊ’ అంటూ ఉండడం లేదా అతని మాటలు రిపీట్ చేయడం, ఏదైనా డౌట్ అడగడం ఇలాంటి మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్.
అంతే కాని మీటింగ్ లో జాయిన్ అయి, మ్యూట్ చేసేసుకొని బొమ్మల్లా చూస్తుంటే చెప్పేవాడి పరిస్థితి ఊహించుకోండి.