ఇంజనీరింగ్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రెండు కోర్సుల మధ్య తేడా ఏమిటి?

కంప్యూటర్ సైన్స్ చదివిన వారు కంప్యూటింగ్ సంబందించిన దాదాపు అన్ని విభాగాలలోను ఇన్వాల్వ్ అవుతారు. అంటే ప్రోసెసర్, సర్క్యూట్ డిజైన్ మొదలుకొని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వరకూ అన్నిటిలోను ప్రతిభ కలిగి ఉంటారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం డేటాను నిల్వ చేయడం, అలా స్టోర్ చేసిన డాటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి మరియు సురక్షితంగా తిరిగి పొందడానికి కంప్యూటర్లు మరియు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లను ఎలా వాడుకోవాలో అన్న విషయం పై ఫోకస్ పెడుతుంది.
ఈ సి.ఎస్.ఇ అండ్ ఐ.టి. ల మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఐ.టి. నిత్య జీవితంలో కంప్యూటర్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనేది డీల్ చేస్తుంటే, సి.ఎస్.ఇ. నిజ జీవితంలో ఉపయోగించే కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి మరియు వాటి వెనుక ఉన్న విజ్ఞానం గురించి పరిశోధిస్తుంది.
ఇక ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయిన సి.ఎస్.ఇ. అండ్ ఐ.టి. గురించి తీసుకుంటే,
సి.ఎస్.ఇ. స్టూడెంట్ సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ యొక్క ఇన్‌ఫర్మేషన్ సిస్టం ను డిజైన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం మరియు మేనేజ్ చేయడం గురించి స్టడీ చేస్తారు. వీళ్ళకు ఉండే ప్రధాన సబ్జెక్ట్స్ లేక స్పెసలైజేషన్స్ ముఖ్యంగా అల్గారిథం, డాటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆపరేటింగ్ సిస్టంస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మొదలైనవి.
ఐ.టి స్టూడెంట్స్ కంప్యూటర్ సిస్టం మరియు అప్లికేషన్స్ యొక్క ఇన్స్టలేషన్, డెవలప్మెంట్ మరియు ఇంప్లిమెంటేషన్ గురించి స్టుదీ చేస్తారు. ఐ.టి. వాళ్ళ ప్రధాన సబ్జక్ట్స్ డాటా స్ట్రక్చర్స్, అల్గారిథం, మైక్రో ప్రోసెసర్, నెట్‌వర్కింగ్, డాటాబేస్, ఇంటర్‌నెట్ టెక్నాలజీస్ మొదలైనవి.
ఇక జాబ్ విషయానికి వస్తే, సి.ఎస్.ఇ. చదివిన వాళ్ళకు ఐ.టి. వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచేం ఎక్కువ పాకేజ్‌తో జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి.
సి.ఎస్.ఇ. వాళ్ళ జాబ్ ఓపెనింగ్స్, డాటా అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సిస్టం ఇంజనీర్ మొదలైనవి.
ఐ.టి. వాళ్ళకు ఫైనాన్స్, మెడిసిన్, డిఫెన్స్ మొదలైన రంగాల్లో ఆపర్టూనిటీస్ ఉంటాయి.
చివరగా, ఎవరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అన్నపుడు,
కోడింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు సి.ఎస్.ఇ. ని, టెక్నికల్ సైడ్ ఎక్కువగా ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళు ఐ.టి. ని తీసుకోవచ్చు.