Which is best? Book Reading Vs YouTube

ఈ రోజు పిల్లలందరూ బుక్ రీడింగ్ కి దాదాపు దూరమయ్యారు అనొచ్చు. వినడానికి చూడడానికి ఇచ్చే ఇంపార్టెన్స్ బుక్ రీడింగ్ కి ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం…
పెద్దలు కూడా ఇదివరకు న్యూస్ పేపర్ ఆర్ మరో బుక్ చదివే వాళ్ళు… ఇపుడు వాళ్ళు కూడా న్యూస్ ని ఛానల్స్ లోనో… యూట్యూబ్ లోనో వింటున్నారు…

బుక్స్ ఎందుకు అంటే… నెట్ లో ఆ ఇన్‌ఫర్మేషన్ దొరకనప్పుడు లేక ఇంకా మొబైల్ లేక ఇంటర్‌నెట్ లేనివాళ్ళకి లేదా టీచర్స్ కి లేదా లెక్చరర్స్కి తప్ప మాకు కాదు అనే స్టేజ్ లో ఉన్నారు… పిల్లలు

ఆఖరికి లైబ్రరీస్ లో కూడా ఈ-లైబ్రరీస్ ఫెసిలిటీస్ ఇచ్చినా, మళ్ళీ అందులో ఆడియో బుక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి…

స్టూడెంట్స్ కైతే… కేవలం… మేము చదువుకొనే స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి ఒక కాలేజి ఐడి కార్డ్ ఎలా అయితే… మెళ్లో వేలాడదీస్తారో దాంతో పాటు… ఒకటో రెండో బుక్స్ చేతిలో ఉంటే… గెటప్ సరిపోతుంది కదా(పెర్‌ఫెక్ట్ గా ఉంటుంది కదా…)…కేవలం దాని కోసం మాత్రమే బుక్స్ ఉపయోగపడుతున్నాయి.

ఈ రోజుల్లో క్లాసులు యూట్యూబ్ లో చూస్తారు, డౌట్స్ ని ప్లే స్టోర్ లో దొరికే ఆప్స్ తో క్లియర్ చేసుకుంటారు… క్వశ్చన్స్ ని గూగుల్ చేస్తారు… ఆన్సర్స్ ని కాపీ పేస్ట్ చేస్తారు… నోట్స్ ని పీడీఎఫ్ ఫార్మేట్ లో షేర్ చేసుకుంటారు… పోనీ ఆ పీడీఎఫ్ ఫార్మేట్ లో ఉన్న దాన్నైనా చదువుతారా అంటే… నో… ఎవరైనా దాన్ని బాగా చదివి సమరీని చెప్తే… ఫాస్ట్ గా వినేస్తారు… అలా వినేసి ఎగ్జాంస్ రాసేస్తారు.. కేవలం ఇవే కాదు ఇంకా ఎన్నొ ఎన్నెన్నో ఫీచర్స్ టెక్నాలజీ అందిస్తోంది..

ఇన్ని ఫెసిలిటీస్ వచ్చిన తరవాత… ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తరవాత… ఇంకా బుక్స్ చదవాలా?

ఎందుకంటే… ఆ బుక్స్ లో ఉండేదంతా… యూట్యూబ్ లో ఎన్నో వీడియోల రూపం లో ఉన్నాయి కదా… ఎందుకు పని గట్టుకొని చదవడం…

పైగా బుక్ అంటే… ఎంత బరువుంటుంది.. అదో మోత.. దాన్ని కాపాడుకోవాలి… కొన్ని వేల బుక్స్ లో ఉండే మేటర్ అంతా ఇంత చిన్న మెమరీ కార్డ్ లో ఉండే వీడియో ల రూపంలో ఉన్నపుడు…

ఎక్కడికి కావాలంటే… అక్కడికి వాటిని తీసుకెల్లి.. ఎప్పుడు కావాలిస్తే… అప్పుడు చూడగలిగేటప్పుడు… ఇంక బుక్స్ ఎందుకు

పోనీ ఫిజికల్ ఫార్మేట్ బుక్ చదవడం పక్కన పెడదాం….

కిండిల్ లాంటి ఈ-బుక్ రీడర్స్, ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి…వీటిని కూడా చాలా తక్కువ మంది మాత్రమే వాడతారు కదా…

పిడీఎఫ్ ఫార్మేట్ లో ఉన్న మీ టెక్స్ట్ బుక్ ని కూడా మీరు చదవరు కదా…. కేవలం ఎగ్జాం లో వచ్చే క్వస్ఛన్ కి ఆన్సర్ కోసం తప్ప…

అంటే… మీకిష్టం లేంది బుక్ కాదు… చదవడం అవునా…

“బుక్ ని దానిలో ఏముంది అని తెలుసుకోవడానికి చదువుతాను… అంతే కానీ ఎగ్జాం కోసం కాదు” అన్నారు స్వామీ వివేకానంద…

అసలు మీకిష్టమైన టాప్ యూట్యూబర్స్ ని ఎవరినైనా అడిగితే… వాళ్ళంతా ఏదైనా మేటర్ చదువుకొని, రీసెర్చ్ చేశాక… వాళ్ళకు తెలిసిన నాలెడ్జి లో కొంత మాత్రమే వీడియో రూపం లో ఇవ్వగలుగుతారు…

కనీసం దీన్ని బట్టైనా చెప్పండి… మరి బుక్ చదివిన వాడికి నాలెడ్జ్ ఎక్కువా లేక యూట్యూబ్ చూసిన వాడికా..

నేను టెక్నాలజీ కి వ్యతిరేకం గా మాట్లాడట్లేదు…

దూర్‌దర్శన్ స్టార్ట్ అయినపుడు దృశ్య శ్రవణ విద్య అనే ప్రోగ్రాం వచ్చేవి… టెలీ పాఠాలు

అప్పట్లో పెద్దవారైపోయి… చదువుకోని వారికి ….సంతకం చేయడం చేతకాని.. పెద్దవాళ్ళకి…ఇలాంటి ప్రోగ్రాంస్ ఉపయోగపడ్డాయి..

ఆ రోజుల్తో పోలిస్తే… ఈ రోజుల్లో దాదాపు చదువు రాని వాళ్ళు… తక్కువ అని చెప్పాలి.. అవునా…
కానీ ఈ రోజుల్లో… రాయడం చదవడం వచ్చిన వాళ్ళకి కూడా చదివే ఓపిక, కోరిక లేవు…

మీకు తెలుసా… రీడింగ్ అనేది చదువుకున్న మనిషి మాత్రమే చేయగలిగిన వన్ ఆఫ్ ది ఆక్టివిటీ… దాన్ని మర్చిపోవద్దు అంటున్నాను…

కొంతమంది అయితే… బుక్ చదవకుండా… ఆ బుక్ లో ఏముందో సమరీ చెప్పే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తే సరిపోతుంది కదా అంటారు…

ఇది చదవడం రానివాళ్ళకి వర్తిస్తుంది..

ఆ యూట్యూబర్స్ చేసేది చాలా మంచి పని… ఆ బుక్ గురించి కనీసం తెలియని వాళ్ళకి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు…

చూడండి… ఎవరైనా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసి వచ్చి… మనకు దాని లో కొన్ని హైలైట్స్ చెప్తే ఎలా ఉంటుంది… ఇక్కడైతే… నాకు వెంటనే… సినిమా చూడాలనిపిస్తుంది… అంటారు..

కానీ సినిమా కి తీసుకెళ్ళగలిగిన టీజర్స్… బుక్స్ చదవడానికి అంత ఇన్‌స్పిరేషన్ ఇవ్వలేకపోతున్నాయి ఎందుకో…

ఒక్కసారి చదవడం వల్ల ప్రయోజనాలు చూద్దాం.

చదివేటప్పుడు మీ బ్రైన్ లో చాలా డిపార్ట్‌మెంట్స్ కలిసి పని చేస్తాయి…

ఆ బుక్ లో మేటర్ చూడడానికి పని చేసే విభాగం..

చూసిన దాన్ని అర్ధం చేసుకోవడానికి పనిచేసే విభాగం.

చదివిన మేటర్ లో వర్డ్స్ యొక్క మీనింగ్ ని అర్ధం చేసుకోవడానికి

చదివేటప్పుడు మేటర్ లోని వర్డ్స్ ని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడానికి పనిచేసే విభాగం.

సో… ఈ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా కలిసికట్టుగా ఎక్సర్‌సైజ్ చేస్తునట్టు అవుతుంది…

బుక్ లో చదువుతున్న విషయాన్ని ఫీల్ అవుతూ, ఇమేజినేషన్ చేసుకోవడం…

నాలెడ్జ్, రీజనింగ్, వొకాబులరీ, ఎంపథీ బుక్స్ చదివడం వల్ల పెరుగుతాయి.

బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ముసలివయసులో వచ్చే అల్జీమర్స్, డిప్రెషన్ లాంటి ప్రోబ్లంస్ చాలా తక్కువ.

మీకు తెలుసా… బిల్ గేట్స్, జుకెర్ బర్గ్ లాంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు రోజులో కనీసం 30 నిమిషాలు బుక్స్ చదవడం లో గడుపుతారని…

ఫిజికల్ బుక్ చదవకపోయినా… ఈ బుక్స్ కూడా చదవొచ్చు…. అసలు చదివే అలవాటు మర్చిపోతున్నారు అనేదే నా పాయింట్.

ఫిజికల్ బుక్స్ కీ.. ఈ బుక్స్ మధ్య ఉండే తేడాలు…

కానీ మళ్ళీ కంటిచూపు, బ్రైన్ యొక్క హెల్త్ కోసం మాత్రం ఫిజికల్ బుక్స్ చదవడమే మంచిది అంటాను..
రోజంతా టెక్నాలజీ తో గడిపినా… రోజులో కొన్ని గంటలైనా ఫిజకల్ బుక్స్ చదివే అలవాటు చేసుకోండి…