ఆన్లైన్ క్లాస్ లేక మీటింగ్ చేసే వారికి కొన్ని సలహాలు

కరోనా వైరస్ వల్ల వచ్చిన లాక్డౌన్ కారణంగా, క్లాస్‌రూం మరియు ఆఫీస్ వ్యవహారాలు ఇప్పుడు ఆన్లైన్ కెక్కాయి. వర్క్ ఫ్రం హోం, లెర్న్ ఫ్రం హోం ఇప్పుడు లేటేస్ట్ ట్రెండ్స్.

అయితే దీనివల్ల సీరియస్ మరియు క్రమశిక్షణ ఉన్న క్లాస్ లేక ఆఫీస్ వాతావరణం పోయి సౌలభ్యమైన, సుఖవంతమైన పరిసరాలు పిల్లలకు, ఉద్యోగస్తులకు లభిస్తున్నాయి. వీడియో చాటింగ్ కూడా ఎప్పుడూ చేయని కొంతమందికి తమ మొహాన్ని వీడియో లో చూస్తూ మాట్లాడడం కొత్తగా ఉంటోంది. అలాంటి వారి కోసమే ఈ పోస్ట్ లో క్రొన్ని సూచనలు, సలహాలు వ్రాస్తున్నాను.

లైటింగ్ సమస్య

చాలా మంది వీడియో జాయిన్ అవుతారు కానీ, వాళ్ళ మొహాలు ఎవరికీ కనిపించవు. వాళ్ళు వీడియో ఆన్ చేయలేదనో లేక నల్లగా ఉన్నారనో కాదు, వాళ్ళు లైటింగ్ కి ముందు నిలబడటం. అంటే వాళ్ళ ముందు కెమేరా, వెనుక లైటింగ్ ఉండడం. కాబట్టి లైటింగ్ మీ కెమేరా వెనుక ఉండేలా జాగ్రత్త పడండి.

కెమెరా యాంగిల్

కెమేరాను మీ ముఖానికి తగినంత దూరంగా, మీ కంటి చూపుకి సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోండి. లేకపోతే, మీ మొహం బాగా కనిపించదు.

సెల్ఫీ అలవాటు మానుకోండి

వీడియో మీటింగ్ లోకి వచ్చాక, మీరు చూడాల్సింది మీ స్వంత థంబ్‌నైల్ కాదు. అలా చూడడం వల్ల, మిమ్మల్ని చూసేవారికి మీరు ఎటో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది జాగ్రత్త. ఫోన్ అయినా, లాప్‌టాప్ అయినా వీడియో చాటింగ్ చేసేటపుడు మీరు చూడాల్సింది కెమేరాను.

పరధ్యానం వద్దు

వీడియో మీటింగ్ లో ఎంటర్ అయి, ఒకసారి అందరికీ హాయ్ చెప్పేసి, ఇక వీడియో ఆఫ్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొనేవారు కొందరు. మరి కొందరు వీడియో ఆన్ చేసి ఉంచి కూడా, పడుకొని సినిమా చూస్తున్నట్టు, కాఫీ లేదా వేరే ఏదైనా డ్రింక్ జుర్రుమని సౌండ్ చేస్తూ త్రాగుతూ, ఫోన్ లో వేరే ఎవరితోనో ఛాట్ చేస్తూ, ఇలాంటి రక రకాల బిహేవియర్ వల్ల మిగతా పార్టిసిపెంట్స్ కి ఉన్న ఇంటరెస్ట్ కూడా పోతుంది. దయచేసి, మీరు ఏ పని మీద మీటింగ్ లోకి వచ్చారో ఆ మూడ్ లో సిన్సియర్ గా ఉండండి. రియల్ క్లాస్ లో లేక మీటింగ్ లో ఎంత సిన్సియర్ గా ఉంటారో అంత!

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

ఆన్‌లైన్ మీటింగ్ లేక క్లాస్ చాల ఇంపార్టెంట్. కాబట్టి వీలైతే మీ ఇంట్లో వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పండి. లేదా మీరే ప్రశాంతంగా ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపొండి. అంతే కాని మీ ఇంట్లో సౌండ్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగ వినిపించనీయకండి.

మ్యూట్ ఆర్ అన్‌మ్యూట్

ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు, వినేవాడు అతడినే చూస్తూ, అతని మాటలకు తగినట్టు తలాడిస్తూ, ‘ఊ’ అంటూ ఉండడం లేదా అతని మాటలు రిపీట్ చేయడం, ఏదైనా డౌట్ అడగడం ఇలాంటి మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్.
అంతే కాని మీటింగ్ లో జాయిన్ అయి, మ్యూట్ చేసేసుకొని బొమ్మల్లా చూస్తుంటే చెప్పేవాడి పరిస్థితి ఊహించుకోండి.

జావా లేదా పైథాన్: మొదట ఏ ప్రోగ్రామింగ్ భాష నేర్చుకోవాలి?

జావా మరియు పైథాన్ రెండు-అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రోగ్రామింగ్ భాషలు. రెండూ చాలా శక్తివంతమైనవి కాని ఈ రెండు భాషలు చాలా భిన్నమైనవి. అందువల్ల, ఈ రెండింటి మధ్య వారి మొదటి ప్రోగ్రామింగ్ భాషగా ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులు గందరగోళానికి గురవుతారు.

ఈ పోస్ట్‌లో, మొదట ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలో మంచిది మరియు ఎందుకు చర్చించబోతున్నాను. నా అభిప్రాయం ప్రకారం, పైథాన్ కంటే జావా మంచి మొదటి ప్రోగ్రామింగ్ భాష అవుతుంది. ఎందుకు అని అడగాలనుకుంటున్నారా? కారణాలను చర్చిద్దాం.

పైథాన్ ఇండెంటేషన్ vs జావా కర్లీ బ్రేసేస్ {}

రెండు భాషలు కోడ్ యొక్క బ్లాకులను వేరు చేయడానికి పూర్తిగా భిన్నమైన శైలిని అనుసరిస్తాయి. C ++, C # మరియు జావాస్క్రిప్ట్ వంటి అనేక ప్రసిద్ధ ప్రోగ్రామింగ్ భాషల వలె జావా కర్లీ బ్రేసేస్ ({}) ఉపయోగిస్తుండగా, పైథాన్ ఇండెంటేషన్‌ను ఉపయోగిస్తుంది.

చాలా మంది డెవలపర్లు పైథాన్ ఇండెంటేషన్‌ను ఇష్టపడతారు. ఏదికానీ కర్లీ బ్రేసెస్ {} కోడ్ ని అర్ధవంతమైన బ్లాక్స్ లా డివైడ్ చేస్తూ, క్రొత్తవారికి కోడ్ ని అర్ధం చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి. కాబట్టి ఈ రంగంలో పూర్తిగా క్రొత్తగా ఉన్న ప్రారంభకులకు కర్లీ బ్రేసెస్ కోడ్ మంచిది.

ఇంకా, ఇప్పుడే ప్రారంభించే ప్రారంభకులకు, ఇండెంటేషన్లతో పనిచేయడం కూడా కష్టం, ఎందుకంటే వారు స్పేస్ క్యారెక్టర్‌ను తప్పుగా పెడితే, మొత్తం ప్రోగ్రామ్ లాజిక్ తప్పు అవుతుంది.

ప్రారంభకులకు మరొక ఇబ్బంది ఏమిటంటే వందలాది కోడ్లతో ఫంక్షన్లను రాయడం.

స్టాటిక్ vs డైనమిక్ టైప్ నేచర్

అతి ముఖ్యమైన కారణం జావా ఒక స్టాటిక్-టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు పైథాన్ డైనమిక్-టైప్. స్టాటిక్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ ముందుగా సర్టైన్ టైప్ గా డిక్లేర్ చేసి ఉంటుంది. డైనమిక్ లాంగ్వేజ్ లో వేరియబుల్ డిక్లరేషన్ అవసరం ఉండదు. వేరియబుల్ లో స్టోర్ చేసిన వాల్యూ ని బట్టి డాటా టైప్ నిర్ణయించబడుతుంది.

జావాలో కఠినమైన నియమాలు మరియు బలమైన టైప్-సేఫ్టీ సిస్టమ్ ఉన్నాయి, ఇది ప్రోగ్రామర్‌లను తక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఇస్తుంది, ఎందుకంటే ఇది కంపైల్ సమయంలో జావా కోడ్‌ను తనిఖీ చేస్తుంది. అందువల్ల, జావాతో, unexpected రన్‌టైమ్ లోపాలు వచ్చే అవకాశాలు తక్కువ. రన్‌టైమ్‌లో కోడ్‌ను తనిఖీ చేసే పైథాన్‌తో డెవలపర్లు చాలా unexpected లోపాలను ఎదుర్కొంటారు. ఎందుకంటే పైథాన్‌లో ప్రతిదీ రన్‌టైమ్‌లో చూపబడుతుంది.

జావాతో పోలిస్తే పైథాన్‌లో కోడ్‌ను డీబగ్ చేయడం మరియు విశ్లేషించడం కూడా కష్టం.
జావా నేర్చుకున్న వ్యక్తి, పైథాన్ లేదా మరే ఇతర భాషకు మారడం చాలా సులభం, అయితే పైథాన్ సింటాక్స్ ఇతర ప్రోగ్రామింగ్ భాషల కంటే కొంచెం భిన్నంగా ఉన్నందున పైథాన్ నుంచి ఇతర ప్రొగ్రామింగ్ లాంగ్వేజేస్ కి కన్వర్షన్ కొంచెం కష్టం.

You cannot copy content of this page